Asianet News TeluguAsianet News Telugu

రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. 
 

two workers killed in a accident in cement factory in nandyal district
Author
First Published Sep 25, 2022, 1:11 PM IST

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం  చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఎత్తైన ర్యాంపులు మీదపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. అయితే సీఎం జగన్ పర్యటనకు మూడు రోజుల ముందు రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇక, సీఎం జగన్ ఈ నెల 28న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కల్వటాల సమీపంలో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రతి ఏడాది 2 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇక, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లును చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో హెలిప్యాడ్‌ను కంపెనీ ప్రతినిధులు సిద్దం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios