ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ముందు రెండు చిక్కు ప్రశ్నలు నిలబడి ఉన్నాయి. నిజానికి రెండూ పాత ప్రశ్నలే.

 

ఇందులో ఒక ప్రశ్నకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇపుడు రెండో సమస్య ప్రతిపక్ష నాయకుడు జగన్ ను ఇరుకున పెడుతూ ఉంది. ఈ రెండు ప్రశ్నలకు ఇద్దరు సమాధానాలుచెప్పలేని స్థితిలోఉండటం వల్ల అసెంబ్లీ గత రెండు రోజులుగా కుంటుతూ నడుస్తూ ఉంది.

 

జనం కోసం ఇద్దరు ఏదో  ఒక సమాధానం చెప్పాలి.

 

వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు దివాళా తీసిన  అగ్రిగోల్డ్  భూములను కొనుగోలు చేశారని, ఇది అక్రమమని,అధికారు దుర్వినియోగమని జగన్ ఆరోపించారు. ఇది అసత్య ఆరోపణ అనేది  ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు విమర్శ. బాధితులకు రావాల్సిన  ఆస్తులను  తెలుగుదేశం ప్రముఖులు అంటే మంత్రులు,ముఖ్యంగా వ్యవసాయ మంత్రి పుల్లరావు కొన్నారనేది చాలా రోజులుగా వినబడుతున్నది. దీని మీదే విచారణ అంటున్నారు జగన్.

 

 ‘పుల్లారావు అగ్రిగోల్డ్‌ భూములు కొన్నారని ఆరోపణ చేశారు. మంత్రి దీనికి సమాధానం చెప్పినా ఆరోపణలు మానుకోవడం లేదు. మంత్రివిచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. న్యాయ విచారణ చేయిద్దాం.  పుల్లారావుది తప్పని తేలితే సభ నుంచి వెలివేద్దాం. జగన్‌ది తప్పని తేలితే సభను నుంచి వెలి తప్పదు. సమాధానం చెప్పండి. ఆరోపణలు చేసి ఎందుకు భయపడుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే సభలో ఉండాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

 

దీనితో ప్రతిపక్ష వైఎస్ ఆర్ పార్టీ ఇదే పద్ధతిలోతమ ప్రశ్నకు సమాధానిమియ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని డిమాండ్ చేశారు.

 

వోటు నోటు కేసును ఉదహరిస్తూ తెలంగాణా ఎసిబి రికార్డు చేసి టెలిఫోన్ సంభాషణలో 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' అని వినిపించిన మాట 'నాది కాదు' అని అసెంబ్లీలో ఒక్కమాట చెప్పండి అపోజిషనోళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చాలా కాలంగా కోరుతున్నారు. 

 

 ముఖ్యమంత్రి నోటుకు వోటు ప్రవర్తన వల్లరాష్ట్రం పరువు పోయిందని దీనిని సభలోచర్చ జరగాలని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది. దీనికి అనుమతించకపోవడంతో  ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఇది తర్వాత సభలో  వ్యక్తిగత దూషణలకు దారితీసింది.


‘ఓటుకు నోట్లు కేసులో ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను సభలో చర్చించాలసిన అవసరంఉంది. చంద్రబాబును మేము ముఖ్యమంత్రిగానే చూస్తున్నాం. రాష్ట్ర పరువు సమస్య ఈకేసుతో ముడవడి ఉంది. ఈ ఆడియో టేపుల్లోని వాయిస్‌ నాది కాదు అని చెబితే చాలు- ముఖ్యమంత్రి గౌరవం మేంకాపాడతాం.  ముఖ్యమంత్రి మీద సాగుతున్న  అసత్య ప్రచారంపౌ మేం పోరాటం చేస్తాం,’  అనిశ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ ఒక్క మాట అనండని నెల్లూరు రూరల్ ఎమ్మెల్య కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు.

 

ఆ గొంతు నాదికాదు అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు...