గుంటూరు జిల్లా బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఒకే రోజు ఇలా ఇద్దరు భర్తలు బలవన్మరణానికి పాల్పడటంతో బాపట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఈ ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల పట్టణంలోని కొండలరావు వీధిలో నివాసముంటున్న మున్నా (30)ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఉరి వేసుకోని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇటీవల అతడితో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

read more  తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని చంపిన కొడుకు

ఇలాంటి కారణంతో ఇదే బాపట్ల పట్టణంలో మరో వ్యక్తి  కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.  విజయలక్ష్మీపురంలో నివాసముండే కోకి దుర్గరెడ్డి (37)తో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ రెండు ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.