మదనపల్లి మైనర్ల మిస్సింగ్... కారణమిదే: డిఎస్పి వెల్లడి (వీడియో)
కేసు నమోదు చేసిన రెండు రోజుల్లోనే ఇద్దరు మైనర్ అమ్మాయిలు ఆచూకీ కనిపెట్టారు మదనపల్లి టూ టౌన్ పోలీసులు.
మదనపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. కేసు నమోదు చేసిన రెండు రోజుల్లోనే ఇద్దరు మైనర్ అమ్మాయిలు ఆచూకీ కనిపెట్టారు మదనపల్లి టూ టౌన్ పోలీసులు. ఈ ఇద్దరు అమ్మాయిలను వెతకడం కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు వారిద్దరిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.
మదనపల్లికి చెందిన షేక్ బషీరా(17), రఫియా ఫిర్దోష్ (16) ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లోంచి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రమైనా వారిద్దరు ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అమ్మాయిల స్నేహితులు, తెలిసినవారికి ఫోన్ చేసి ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు ఈ నెల 15వ తేదీ రాత్రి 8 గంటలకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
read more చిత్తూరు జిల్లాలో ఇద్దరమ్మాయిలు అదృశ్యం: మేనమామ ఫిర్యాదు
అమ్మాయిలను వెతకడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు టెక్నికల్ క్లూస్ ద్వారా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడినుండి అమ్మాయిలిద్దరిని మదనపల్లికి తీసుకువచ్చారుఈ మిస్సింగ్ కేసుపై మదనపల్లి డిఎస్పి రవిమనోహర్ చారి మాట్లాడుతూ... అమ్మాయిలిద్దరూ ఇంట్లో సమస్య వల్లే ఇంట్లోంచి వెళ్ళిపోయారన్నారు.
వీడియో
వీరు మైనర్లు అయినందువల్ల వీరిని చైల్డ్ వెల్ఫేర్ కు తీసుకువెళ్లినట్లు... అక్కడ వారు ఏ నిర్ణయం తీసుకుంటే అలా చేస్తామన్నారు. ఒక అమ్మాయికి తల్లిదండ్రులు లేరని... ఇంకో అమ్మాయికి తండ్రి మరో పెళ్లి చేసుకున్నారని డిఎస్పి తెలిపారు.