చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఈ ఇద్దరు అమ్మాయిలను వెతకడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. 

ఇద్దరు అమ్మాయిల అదృశ్యంపై టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణంలో ముస్లిం మైనారిటీలు అమ్మాయిలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.

సుబాష్ రోడ్డు డోర్ నంబర్ 16-158 నందు నివాసం వుండే బషీరా 17  సంవత్సరాలు, ఈశ్వరమ్మ కాలనీ రఫ్ఫియా ఫిర్దోష్ 16 సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆడపిల్లలు అదృశ్యమయ్యారు.

ఈనెల12 వ తేది నుండి కనిపించడం లేదని మేనమామ గయాజ్ ఖాన్ పోలీసులకు పిర్యాదు ేశారు. ఒక అమ్మాయి బహీరా ఇంటర్ మీడియట్ చదువుతుండగా, రెండో అమ్మాయి రఫ్ఫియా ఫిర్దోష్ 8వ తరగతి చదవుతోంది.

 

 

"