విశాఖపట్టణం: ఎల్జీ పాలిమర్స్ నుండి విడుదలైన గ్యాస్ గాలిలో కలిసిపోయింది.ఈ గాలిని పీల్చిన  ఇద్దరు లోకో పైలెట్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ నెల 7వ తేదీ  తెల్లవారుజామున ఈ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీకైంది. దీంతో 12 మంది మృతి చెందారు. సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

ఇవాళ తెల్లవారుజామున గోపాలపట్నం సమీపంలో 45 నిమిషాల పాటు గూడ్స్ రైలు ఆగింది. ఆ సమయంలో గూడ్స్ రైలులో ఇద్దరు లోకో పైలెట్లు ఆ ప్రాంతంలో గాలిని పీల్చారు. 

also read:''విశాఖ బాధితులకు కొత్త సమస్యలు... న్యూమోనియా లక్షణాలతో కలవరం''

దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరికి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించారరు. దీంతో కోలుకొన్నారు.

స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో ఇప్పటికి ఐదుగురు లోకో పైలెట్లు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ కాకుండా నిపుణుల బృందం చర్యలు తీసుకొంటుంది.