కడప జిల్లాలో విషాదం: తేనే కోసం వెళ్లి వాగులో ముగ్గురు గల్లంతు, ఇద్దరు మృతి

తేనే కోసం అడవికి వెళ్లి వాగులో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం నాడు రాత్రి కురిసిన  వర్షానికి వాగులో ఒక్కసారిగా  పెద్ద ఎత్తున నీరు ప్రవహించింది. ఈ ప్రవాహంలో నిద్రలోనే ముగ్గురు గల్లంతయ్యారు. అయితే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. 

Two killed while going for honey in Kadapa district

కడప: తేనే కోసం వెళ్లి వాగులో కొట్టుకుపోయిన ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా, ఒక్కరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది. 

Nellore జిల్లా Udayagiri మండలం Durgampalli కి చెందిన తొమ్మిది మంది honey ను తెచ్చేందుకు Forestప్రాంతానికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వారు Kadapa జిల్లాలోని Gopavaramమండలం Vallalavaripalemకి చేరుకున్నారు.  ఆదివారం నాడు అటవీ ప్రాంతంలో తేనేను సేకరించిన తొమ్మిది మంది  రాత్రి కావడంతో అక్కడే నిద్రపోయారు. వీరు పడుకున్న చోట వాగు ఉంది. అయితే ఆదివారం నాడు అర్ధరాత్రి  వాగు పై భాగంలో Heavy Rain కురిసింది.

ఈ వర్షంతో  వాగు పొంగిపొర్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించని వారు నిద్రలోనే వాగులో ముగ్గురు కొట్టుకుపోయారు.  అయితే ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.  ఇద్దరు వాగులో కొట్టకుపోయి చనిపోయారు. చనిపోయిన వారిని మామిళ్ల రమేష్ మామిళ్ల వెంగయ్యలుగా గుర్తించారు.  స్థానికుల సహాయంతో ఇద్దరు డెడ్ బాడీలను పోలీసులు వెలికి తీశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios