అనంతపురం: అనంతపురం జిల్లాలో మంగళవారం నాడు ఉదయం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.ప్రత్యర్ధులు కారం చల్లి ఇద్దరిని వేటకొడవళ్లతో హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గొర్రెపల్లి గ్రామంలోని పొలం గట్టు వద్ద ఇద్దరిపై ప్రత్యర్ధులు కారం చల్లి వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు.ఈ హత్ చేయడానికి గల కారణాలు ఏమిటనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.మృతులు ఎవరనే విషయమై కూడ పోలీసులు స్థానికులను ప్రశ్నిస్తున్నారు.