విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఇండియన్ నేవీకి చెందిన సుమిత్ర నౌకలో పనిచేస్తున్న 30 మంది సిబ్బంది యారాడ బీచ్‌ సందర్శనకు వెళ్లారు.

వీరిలో జగత్ సింగ్, శుభమ్‌ అనే ఇద్దరు నౌకా సిబ్బంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే నేవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా జగత్ సింగ్ మృతదేహం ఒక్కటే లభించింది.

శుభం ఆచూకీ ఇంకా లభించలేదు. అతనికోసం హెలికాప్టర్ ద్వారా నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.