గుంటూరు: వినుకొండ నియోజకవర్గ పరిధిలోని శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గంపై మరో వర్గం దాడులకు దిగడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దుకాణం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణానికి కారణమయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తర్వాత కూడా మళ్లీ గొడవ జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీడియో

"