మండల అధ్యక్ష పదవికోసం పార్టీ కార్యాలయంలోనే రెండు వర్గాలు ఘర్షనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది.  

గుంటూరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయం సాక్షిగా గుంటూరు టిడిపిలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు మండలానికి చెందిన రెండు టిడిపి గ్రూప్ లు పార్టీ ఆఫీస్ లో నానా రభస చేశారు. మండల అధ్యక్ష పదవి మాకంటే మాకంటూ ఇరు వర్గాలు తన్నులాటకు దిగాయి. రెండు వర్గాల మధ్య మొదట మాటలయుద్దం మొదయి అదికాస్తా పెద్దదై ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరుకొనే స్థాయికి చేరింది. అంతేకాదు పార్టీ జెండాలు కట్టిన కర్రలతో కొట్టుకున్నారు. 

ఈ ఘర్షణలో పలువురు టిడిపి నాయకులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా కార్యాలయంలోని ఫర్నీచర్ కూడా ధ్వంసమయ్యింది. ఇంతటితో గొడవ సద్దుమణగకుండా గాయాలైన వారితో ఇరువర్గాలు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దీంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. అయితే పోలీసులు ఇరువర్గాలను నిలువరింపజేసి ఫిర్యాదు తీసుకుని అక్కడినుండి పంపించారు. 

వీడియో