కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో దారుణం చోటుచేసుకుంది.పెళ్లికి నిరాకరించిందనే నెపంతో యువతి ఇంటికి ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని  స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

 ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం చేశారన్న అక్కసుతో ఉన్మాది ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికులు విషయాన్ని గమనించి మంటలను ఆర్పారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 


ప్రేమ పేరుతో మాసాని శ్రీనివాస్ సత్యవతి కూతురును  వేధించాడు. అయితే శ్రీనివాస్ వేధింపులకు పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్‌కు కాకుండా వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 

సత్యవతికి మేనల్లుడు. శ్రీనివాస్. సత్యవతి కూతురును ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సత్యవతి గొంతును కోశాడు శ్రీనివాస్. అయితే శ్రీనివాస్‌కు  కాకుండా మరో వ్యక్తికి ఇచ్చి ఇటీవల సత్యవతి కూతురును ఇచ్చి పెళ్లి చేశారు.

శ్రీనివాస్ కుటుంబం తిరుపతిలో నివాసం ఉంటుంది. సత్యవతి ఆడపడుచు కొడుకే శ్రీనివాస్. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడ ఉంది.  ఈ కారణంగానే శ్రీనివాస్ సత్యవతి కూతురును పెళ్లి చేసుకోవాలని భావించాడు.

తన కూతురు చిన్నదని తర్వాత పెళ్లి చేస్తామని సత్యవతి శ్రీనివాస్ కు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇటీవలనే సత్యవతి తన కూతురును వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది.

దీంతో కక్ష పెంచుకొన్న శ్రీనివాస్  మంగళవారం నాడు రాత్రి  సత్యవతి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  ఈ ఘటనలో   ఇద్దరు సజీవద దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.