పండగపూట పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి వేడుకల్లో రెండు వేర్వేరు ఘటనల్లో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు.

నిడదవోలులోని వడ్డీల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద విద్యాదాఘాతంతో రఘునాథ్ అనే వ్యక్తి మరణించగా.. జీలుగుమిల్లి మండలం పి. అంకపాలెంలో కరెంట్ షాక్‌తో బొంతు రామారావు అనే మరో వ్యక్తి మరణించడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.