అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో విద్యుత్ షాక్ తో  తల్లీ, కొడుకు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన  మంగళవారం నాడు చోటు చేసుకొంది.

అనంతపురం: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో విద్యుత్ షాక్ తో తల్లీ, కొడుకు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.బైక్‌పై తల్లీ కొడుకు వెళ్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో ఇద్దరు కూడ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇవాళ ఉదయం బైక్ పై వెంకటస్వామి ఆయన తల్లి వెంకటలక్ష్మి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 11 కేవీ విద్యుత్ లైన్లు ట్రిప్ అయి తెగిపోయి కిందపడ్డాయి.ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించలేదు.

ఈ విషయం తెలియని వెంకటస్వామి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ వైర్ తగిలి షాక్ కు గురయ్యారు. వెంటనే వారికి మంటలు అంటుకొని సజీవదహనమయ్యారు.స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు మరణించారు. 

విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.విద్యుత్ వైర్లు వీరికి ఎలా తగిలాయనే విషయమై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బైక్ పై వెళ్తున్నవారికి విద్యుత్ తీగలు తగలడానికి కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.