అనకాపల్లి  జిల్లాలోని నర్సీపట్నంలో  ఓ  జ్యుయలరీ  దుకాణంంలో  జరిగిన  అగ్ని ప్రమాదంలో  ఇద్దరు  మృతి  చెందారు.  మరో  ఇద్దరు  గాయపడ్డారు.  షార్ట్  సర్క్యూట్ కారణంగా  ప్రమాదం  జరిగిందని  పోలీసులు భావిస్తన్నారు.

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్నీపట్నంలోని ఓ జ్యుయలరీ దుకాణంలో అగ్ని ప్రమాదంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. నర్సీపట్నంలోని కృష్ణాబజారులో ఉన్న జ్యుయలరీ షాపులో ఆదివారంనాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జ్యుయలరీ దుకాణ యజమాని నానాజీ ఆయన తనయుడు మౌలేష్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికారులు భావిస్తున్నారు.