నెల్లూరు జిల్లాలో కల్తీ మద్యం కలకలం: ఇద్దరు మృతి

two die after consuming illicit liquor in Nellore district
Highlights

నెల్లూరు జిల్లాలో కల్తీ మద్యానికి  ఇద్దరు మృతి చెందారు.  మృతులను భాషా, షకీర్‌గా గుర్తించారు. జిల్లాలోని కాగులపాడులోని మద్యం దుకాణంలో  మద్యాన్ని కొనుగోలు చేసి  తాగారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కల్తీ మద్యానికి  ఇద్దరు మృతి చెందారు.  మృతులను భాషా, షకీర్‌గా గుర్తించారు. జిల్లాలోని కాగులపాడులోని మద్యం దుకాణంలో  మద్యాన్ని కొనుగోలు చేసి  తాగారు. ఆ తర్వాత వారిద్దరూ కూడ అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  వారిద్దరూ మృతి చెందారు.

నెల్లూరు జిల్లాకు చెందిన  భాషా, షకీర్ ‌లు ఓ వివాహం సందర్భంగా  గుర్రాలను సప్లయ్ చేసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో  ఓ మద్యం దుకాణంలో  మద్యాన్ని కొనుగోలు చేశారు. ఈ మద్యాన్ని తాగిన కొద్దిసేపటికే  వారిద్దరూ కూడ  అస్వస్థతకు గురయ్యారు.

దీంతో వారిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారని స్థానికులు చెప్పారు. అయితే కల్లీ మద్యం కారణంగానే వీరిద్దరూ మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader