సారాంశం

విజయనగరం జిల్లా బొబ్బిలి‌లో విషాదం చోటుచేసుకుంది. బొబ్బలి గ్రోత్‌ సెంటర్లో ఉన్న ఎస్సార్ పెట్రోల్‌ బంకు ట్యాంకులో దిగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి‌లో విషాదం చోటుచేసుకుంది. బొబ్బలి గ్రోత్‌ సెంటర్లో ఉన్న ఎస్సార్ పెట్రోల్‌ బంకు ట్యాంకులో దిగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో ఒకరు ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లి మృతిచెందగా, మరొకరు  అతడిని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. ఈ ఘటన జరిగిన పెట్రోల్ బంకు కొన్ని నెలల నుంచి  మూతబడింది. అయితే తాజాగా పెట్రోల్ బంక్ ట్యాంకులను శుభ్రం చేయించాలని యజమాని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పనికి వచ్చిన కూలీల్లో.. పొలినాయుడు డీజిల్‌ ట్యాంకు శుభ్రం చేసేందుకు లోనికి దిగాడు. 

అయితే అక్కడ ఊపిరి ఆడకపోవడంతో పొలినాయుడు మృతిచెందాడు. అయితే ఇది గమనించిన లారీ హెల్పర్ అనుషు ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఒకరైన అనుషు.. బీహార్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.