Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ జిల్లాలో భవానీ భక్తులపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న భవానీ భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు ఘటన స్థలంలోనే మృతిచెందారు.

Two bhavani Devotees Died after car hits in kakinada district
Author
First Published Dec 3, 2022, 10:18 AM IST

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న భవానీ భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు భక్తులను గాయాలు అయ్యాయి. మృతులను శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం పెనసం గ్రామానికి చెందిన ఈశ్వరరావు, సంతోష్‌లుగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం భక్తులు వారి స్వగ్రామం నుంచి విజయవాడలోని కనదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. 

అయితే తుని జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లాలోని పత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి మరో లారీని ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో రెండు వాహనాల క్యాబిన్‌లలో ఇరుకున్న ఇద్దరు డ్రైవర్‌లు, ఇద్దరు క్లీనర్‌లు సజీవ దహనం అయ్యారు. మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో రెండు వాహనాలు కూడా దగ్దమయ్యాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు  అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు. ఇసుక లారీకి చెందిన డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios