కుటుంబకలహాలతో ఓ తల్లి అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. రెండున్నరేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా కన్నకూతుర్ని అతి దారుణంగా చంపేసింది.

కుటుంబ కలహాలు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు, హత్యలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు.. తమ కడుపున పుట్టిన చిన్నారుల్ని కూడా బలితీసుకుంటున్నారు. 

అలాంటి అమానుషమైన ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో ఓ తల్లి అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. రెండున్నరేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా కన్నకూతుర్ని అతి దారుణంగా చంపేసింది. వివరాల్లోకి వెడితే.. 

అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారిని తల్లి అతి దారుణంగా చంపేసింది. చిన్నారి చేతి, మెడ నరాలు కోసి హత్య చేసింది. అనంతరం తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.