రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మంత్రి జయరాం భూముల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తమను మోసం చేశారంటూ మంత్రి జయరాం సతీమణి ఆస్పరి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు.

ఇట్టినా కంపెనీ ఎండీ మను, మాజీ డైరెక్టర్ మంజునాథ్ సహా నలుగురిపై ఆమె కేసు పెట్టారు. ఇట్టినా కంపెనీ భూములపై మంజునాథ్‌కు అధికారం కట్టబెడుతూ బోర్డు తీర్మానం చేసి ఇప్పుడు లేదంటున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే తనకు విక్రయించిన పొలం మరొకరికి విక్రయిస్తున్నారంటూ ఇట్టినా కంపెనీపై కరణం పద్మనాభరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇట్టినా కంపెనీ ఎండీ మను, మంజునాథ్ సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.