Asianet News TeluguAsianet News Telugu

మొరాయించిన టీటీడీ వెబ్ సైట్ సర్వర్లు

ఈనెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనుంది. వైకుంఠద్వార దర్శనం నుంచి ప్రతి రోజు 20వేల మంది భక్తులను అనుమతిస్తారు. 

TTD Website Servers Are Not Working
Author
Hyderabad, First Published Dec 11, 2020, 2:05 PM IST

టీటీడీ వెబ్సైట్ సర్వర్లు మరోసారి మొరాయించాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 10 రోజులపాటు వైకుంఠద్వారాలు తెరవాలని నిర్ణయించింది. 10 రోజులకు సంబంధించి దర్శనం టిక్కెట్ల కోటాను పూర్తిగా ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచింది. 

అందులో భాగంగా ఈనెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనుంది. వైకుంఠద్వార దర్శనం నుంచి ప్రతి రోజు 20వేల మంది భక్తులను అనుమతిస్తారు. ఇలా 10 రోజులకు సంబంధించి 2 లక్షల టిక్కెట్లను టీటీడీ అధికారులు ఆన్లైన్లో పెట్టారు. 

శుక్రవారం ఉదయం 2 లక్షల టిక్కెట్లను అందుబాటులో ఉంచగా ఇప్పటికే 70 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్లు విడుదల చేసిన అరగంటలోనే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల టిక్కెట్ల కోటా పూర్తయింది. మిగిలిన రోజుల టిక్కెట్ల కోసం లక్షలాదిగా భక్తులు వెబ్సైట్ను ఓపెన్ చేయడంతో సర్వర్లు మొరాయించాయి. ఒక్కసారిగా వెబ్సైట్కు రష్ పెరగడంతో సైట్ తెరుచుకోవడంలేదు. సర్వర్ను త్వరలోనే పునరిద్ధరిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios