తిరుమల: ఈ నెల 28వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయమై పాలకవర్గ సమావేశం చర్చించనుంది.  బ్రహ్మోత్సవాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడ చర్చించనున్నారు.

also read:కరోనా నుండి కోలుకొన్న తిరుమల పెద్ద జియ్యంగారు

కరోనా నేపథ్యంలో గతంలో మాదిరిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ  బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై చర్చించనున్నారు. 

బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో  రూ. 300 టిక్కెట్లను ఇప్పటికే రద్దు చేశారు.  శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గతంలో శ్రీవారి ఊరేగింపు నిర్వహించేవారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ దఫా ఊరేగింపు నిర్వహించే  అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ విషయమై లాక్ డౌన్ నిబంధనల నుండి ఊరేగింపులకు కేంద్రం నుండి మినహాయింపు దక్కకపోవడంతో బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్టుగా టీటీడీ అధికారులు ప్రకటించారు.

కరోనాను పురస్కరించుకొని ఈ దఫాల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అతి జాగ్రత్తగా నిర్వహించాలని టీటీడీ పాలకమండలి భావిస్తోంది. మరో వైపు వెంకన్న దర్శనానికి భక్తుల సంఖ్య పెంచే విషయంలో కూడ ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.