అశ్లీల సైట్లు: ఎస్వీబీసీలో మరో ముగ్గురి ఉద్యోగులపై వేటు

ఎస్వీబీసీ ఛానెల్‌లో  ఆశ్లీల సైట్ల కేసులో మరో ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ వేటువేసింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.

TTD suspends another three employees from SVBC Channel lns

తిరుపతి: ఎస్వీబీసీ ఛానెల్‌లో  ఆశ్లీల సైట్ల కేసులో మరో ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ వేటువేసింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.

శతమానం భవతి కార్యక్రమం కోసం  లింక్ పంపాలని ఓ భక్తుడు టీటీడీకి ధరఖాస్తు చేసుకొన్నాడు. అయితే ఆ భక్తుడికి శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ కాకుండా ఫోర్న్ సైట్ల లింక్ ను పంపారు టీటీడీ ఉద్యోగులు.ఈ విషయమై ఆ భక్తుడు టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మెన్ కు  ఫిర్యాదు చేశాడు.  ఈ ఫిర్యాదు ఆధారంగా  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మెన్ వైవీసుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 11వ తేదీన వెలుగు చూసింది.

ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్లు  చూస్తున్న ఉద్యోగులను గుర్తించి  టీటీడీ చర్యలు తీసుకొంది. గత ఏడాది డిసెంబర్  14వ తేదీన  ఐదుగురు ఉద్యోగులను  టీటీడీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మరికొందరు ఉద్యోగులపై వేటు వేశారు.ఎస్వీబీసీ ఎడిటర్ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్ లను కూడ విధుల నుండి తప్పిస్తూ  సోమవారం నాడు టీటీడీ నిర్ణయం తీసుకొంది.

సస్పెన్షన్ కు గురైన ఉద్యోగుల కంప్యూటర్లలో ఆశ్లీల దృశ్యాలు ఉన్నట్టుగా టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం గతంలో గుర్తించింది. ఈ క్రమంలలోనే ఇవాళ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios