మహాసంప్రోక్షణపై  ఆగమశాస్త్ర నివేదికను హైకోర్టు‌కు గురువారం నాడు టీటీడీ సమర్పించింది. వచ్చే నెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు టీటీడీ మహాసంప్రోక్షణను నిర్వహించనుంది.మహాసంప్రోక్షణపై దాఖలైన పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టు  విచారణ నిర్వహించింది.

హైదరాబాద్: మహాసంప్రోక్షణపై ఆగమశాస్త్ర నివేదికను హైకోర్టు‌కు గురువారం నాడు టీటీడీ సమర్పించింది. వచ్చే నెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు టీటీడీ మహాసంప్రోక్షణను నిర్వహించనుంది.మహాసంప్రోక్షణపై దాఖలైన పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించింది.

మహాసంప్రోక్షణను పురస్కరించుకొని ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను నిలిపివేస్తామని టీటీడీ కోర్టుకు తెలిపింది. అయితే సీసీ కెమెరాలను ఎందుకు నిలిపివేస్తారో చెప్పాలని టీటీడీని పిటిషనర్ కోరారు. 

గర్భగుడిలో కాకుండా ఆలయం వెలుపల ఉన్న సీసీకెమెరాలను ఎందుకు బంద్ చేయాల్సి అవసరం ఉందో చెప్పాలన్నారు. మరోవైపు గర్భగుడిలో కాకుండా బయట ఉన్న కెమెరాలను కూడ ఎందుకు బంద్ చేసే విషయమై ఉన్న అభ్యంతరాలను సోమవారం నాటికి తెలపాలని కోర్టు టీటీడీని కోరింది.

మహాసంప్రోక్షణ సమయంలో అన్ని చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాలను చేయాలని కూడ పిటిషనర్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై తదుపరి విచారణ సమయంలో జరిగే విచారణలో కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.