టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్: పోలీసులకు ఫిర్యాదు

టీటీడీ ని పోలిన  నకిలీ వెబ్ సైట్ ను గుర్తించారు. ఈ వెబ్ సైట్ పై   టీటీడీ  అధికారులు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.
 

 TTD lodges complaint against fake site lns


తిరుమల:  టీటీడీ నకిలీ వెబ్ సైట్ ను  గుర్తించారు.  నకిలీ వెబ్ సైట్ పై ఆదివారంనాడు  పోలీసులు  కేసు నమోదు  చేశారు. టీటీడీని పోలిన 40 నకిలీ వెబ్ సైట్లపై  పోలీసులు  కేసులు నమోదు  చేశారు. తాజాగా  మరో నకిలీ వెబ్ సైట్ సైట్  పై  కేసు నమోదు  చేశారు.

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే  భక్తులకు  అన్ని రకాల  టిక్కెట్లను  ఆన్ లైన్ లోనే  టీటీడీ కేటాయిస్తుంది.  60 శాతం  టిక్కెట్లను  టీటీడీ ఆన్ లైన్ లోనే  కేటాయిస్తుంది. దీంతో  టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లతో  మోసాలకు  పాల్పడుతున్నారు మోసగాళ్లు.   నకిలీ వెబ్ సైట్లపై  టీటీడీ ఐటీ శాఖ  కూడా  జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కూడా  టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లు  పుట్టుకువస్తూనే ఉన్నాయి. 

తాజాగా గుర్తించిన  నకిలీ వెబ్ సైట్ పై వన్ టౌన్ పోలీసులకు టీటీడీ  అధికారులు ఇవాళ ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.  
 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపిసి ప్రకారం పోలీసులు నమోదు  చేశారు.  కేసును  ఏపీ  ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. 

ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్ సైట్ పై  విచారణ ప్రారంభించారు.  అధికారిక వెబ్ సైట్  https://tirupatibalaji.ap.gov.in/ . అధికారిక వెబ్ సైట్  ను పోలి ఉండేలా  నకిలీ వెబ్ సైట్ ను  రూపొందించారు నిందితులు. https://tirupatibalaji-ap-gov.org/  పేరుతో  నకిలీవెబ్ సైట్ ను  రూపొందించారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో  ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవచ్చు.  

 TTD lodges complaint against fake site lns

గతంలో  కూడా నకిలీ వెబ్ సైట్లలో  డబ్బులు పే చేసి  టిక్కెట్లు  పొందిన  భక్తులు తిరుమలకు వచ్చిన తర్వాత  తాము మోసపోయినట్టుగా  తెలుసుకున్నారు. ఈ తరహ  ఘటనలు గతంలో అనేకం  చోటు  చేసుకున్నాయి. ఈ విషయాలపై  పోలీసులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios