తిరుమల : శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం..

ఇలా లభించే చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరిగిపోయాయి. దీంతో చిల్లర నాణేలను నోట్ల రూపంలో మార్చుకునేందుకు టీటీడీ ఈ ధనప్రసాదాన్ని ప్రారంభించింది. 

ttd introduced srivari dhana prasadam, tirupati

తిరుపతి : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరిట భక్తులకే తిరిగి పంపిణీ చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. స్వామివారికి నిత్యం లభించే హుండీ ఆదాయంలో 10నుంచి 20 లక్షల రూపాయల వరకు భక్తులు చిల్లర నాణేలు రూపంలో కానుకల సమర్పిస్తుంటారు. 

ఇలా లభించే చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరిగిపోయాయి. దీంతో చిల్లర నాణేలను నోట్ల రూపంలో మార్చుకునేందుకు టీటీడీ ఈ ధనప్రసాదాన్ని ప్రారంభించింది. 

తిరుమలలో సామాన్యులు బస చేసే అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణేలను 100 రూపాయల ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్లలో బక్తులకు అందిస్తోంది. భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్ ను శ్రీవారి ధనప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి  నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

ప్రస్తుతం రూపాయి నాణేలను ఇస్తుండగా.. రానున్న రోజుల్లో 2,5 రూపాయల నాణేల ప్యాకెట్ లను కూడా భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఒకవేళ భక్తులు చిల్లర నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో క్యాష్ ఆన్ డిపాజిట్ ను భక్తులకు చెల్లించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios