Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి పత్రికలు పంచుతుండగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి గుండెనొప్పి..

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి గుండెనొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు జనవరిలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచుతుండగా ఈ ఘటన జరిగింది. 

TTD EO Dharma Reddy's son Chandramouli has a heart attack in Chennai
Author
First Published Dec 19, 2022, 11:55 AM IST

చెన్నై : కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో ఇటీవల టీటీడీ ఈవో ధర్మారెడ్డి వార్తల్లో  వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా  ధర్మారెడ్డి కుమారుడు గుండెపోటుకు గురవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.  ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి. ఆయన కుమారుడు చంద్రమౌళి అలియాస్ శివ చెన్నైలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స నడుస్తోంది. చంద్రమౌళి 28 సంవత్సరాలు. ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. 

ఆయనకు ఇటీవలే టీటీడీ చెన్నై  స్థానిక సలహా మండలి అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త ఏజే శేఖర్ రెడ్డి కూతురితో వివాహం నిశ్చయమయింది. వచ్చే నెలలో వీరి వివాహం తిరుమలలోనే జరగాల్సి ఉంది.  జరగాల్సిఉంది ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగింది. జనవరిలో పెళ్లి ఉండడంతో రెండు కుటుంబాలవారు శుభలేఖలు ముద్రించారు. వాటిని పంచుతున్నారు. ఈ క్రమంలోనే  ఆదివారం చెన్నైలోని ఆల్వార్ పేటలో ఉన్న బంధువులకు  పెళ్లి పత్రికలు ఇవ్వడానికి చంద్రమౌళి కారులో వెళ్లారు. కాసేపటికి గుండెలో ఏదో నొప్పిగా అనిపిస్తున్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో.. అతను వెంటనే  దగ్గర్లోని  కావేరి కావేరి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన శేఖర్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని  వివరాలు తెలుసుకున్నారు.  దీనిమీద ధర్మారెడ్డి సన్నిహితులు మాట్లాడుతూ..   పెళ్లి పత్రికలు పంచడానికి వెళుతుండగా చంద్రమౌళి కి వచ్చిన సంగతి వాస్తవమే అతనిని వెంటనే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. చంద్రమౌళి మెల్లగా కోలుకుంటున్నారు అని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బయలుదేరిన ధర్మారెడ్డి దంపతులు సాయంత్రం ఐదున్నర గంటలకు కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు.

కోర్ట్ ధిక్కరణ నేరం.. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట, సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే

ఇదిలా ఉండగా,  డిసెంబర్ 14న టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయనందుకు ఈ మేరకు కోర్టు ధిక్కరణ కింద ఈ శిక్ష పడినట్లు తెలిసింది. దీంతోపాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 27లోపు ధర్మారెడ్డి హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని తెలిపింది. మంగళవారం నాడు హైకోర్టు సింగిల్ జడ్జి ఈ మేరకు తీర్పు నిచ్చారు. అసలేం జరిగిందంటే..2011లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో  ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఈ నోటిఫికేషన్ ను అదే ఏడాది సవాల్ చేస్తూ కొమ్ము బాబు, బి. సేవ్లా నాయక్, ఆర్ స్వామి నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. వీరంతా గత 17 ఏళ్లుగా ప్రోగ్రామ్ అసిస్టెంట్లుగా టీటీడీలో పనిచేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఈ వ్యాజ్యం మీద న్యాయస్థానం విచారణ జరిపింది. టిటిడి జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ల సర్వీసును రెగ్యులర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే దీని మీద టిటిడి ఏలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో  హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని పేర్కొంటూ ఆ ముగ్గురు ఈ ఏడాది జూన్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున కేకే దుర్గాప్రసాద్ వాదించారు. టీటీడీ ఈవో దీని మీద కౌంటర్ దాఖలు చేశారు ఈ ఏడాది ఏప్రిల్ 13న ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 20న అప్పీలు చేశామని అది పెండింగ్లో ఉందని తెలిపారు. అంతేకాదు, కోర్టు ఆదేశాల అమలుకు టైం పీరియడ్ విధించలేదని తెలిపారు. సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ ఈవో తదితరుల తరఫున వాదించారు. వారు పెట్టిన అప్పీలు పెండింగ్లో ఉందని అది ఆ సమయంలో కోర్టు ధిక్కరణ కేసు సహజంగా విచారణ చేయకూడదని అన్నారు. 

ఆ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. టీటీడీ ఈవో వేసిన కౌంటర్ పరిశీలించామని.. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ప్రతివాదుల వైఖరి ఏమిటో దీని వల్ల స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. గరిష్టంగా రెండు నెలల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని అని తెలిపారు. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులను ఉల్లంఘించారని తెలిపారు. కోర్టు ధిక్కరణ కింద టీటీడీ ఈవో ధర్మారెడ్డికి  జైలు శిక్షకు అర్హులే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, రూ.2వేలుజరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిమీద రెండు రోజుల తరువాత అంటే డిసెంబర్ 16న సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios