Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం: టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం

టీటీడీ పాలక మండలి శనివారం నాడు జరిగింది.ఈ సమావేశంలో టీటీడీ పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

TTD Decides To Construct Third Ghat Road at Tirumala
Author
Tirupati, First Published Dec 11, 2021, 4:26 PM IST

తిరుమల: Tirumalaకు మూడో ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకొంది. టీటీడీ పాలకవర్గ సమావేశం శనివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నారు.శనివారం నాడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి Ttd Trust Board సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను  మీడియాకు వివరించారు. నాదనీరాజనం వద్ద శాశ్వత ప్రాతిపదికన మండపాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు.Annamaiah ప్రాజెక్టు వద్ద ఇటీవల కొట్టుకుపోయిన ఆలయాలను పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారం తాపడం చేయాలని కూడా టీటీడీ పాలకవర్గం నిర్ణయం తీసుకొంది. 

also read:ప్రయాణం వాయిదా వేసుకోండి, ఆరు నెలల్లోపుగా దర్శనం కల్పిస్తాం: భక్తులకు టీటీడీ చైర్మెన్ రిక్వెస్ట్

రూ. 3 కోట్లతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించారు. రూ. 12 కోట్లతో మహిళా యూనివర్శిటీతో హాస్టల్ భవనాలను నిర్మించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. రూ. 10 కోట్లతో స్విమ్స్ లో భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లను పెంచాలని నిర్ణయం తీసకొన్నారు.  ఆర్జిత సేవలకు సైతం భక్తులకు కూడా అనుమతించాలని తీర్మానించారు. గత ఏడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ దర్శనం ద్వారా దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకొన్నారు. పద్మావతి పిల్లల ఆసుపత్రి వద్ద అన్నమయ్య మార్గంలో మూడో ఘాట్ రోడ్డులో నడక మార్గం , ఘాట్ రోడ్డు నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ది చేయనున్నారు.  తిరుమలలోనే హనుమంతుడు పుట్టాడనిత టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు అంజనాద్రిని అభివృద్ది చేయాలని తీర్మానించారు. అన్నమయ్య మార్గంలో నడిస్తే నేరుగా తుంబురు కోనకు చేరుతామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.ఈ మార్గం నిర్మించాలని కడప జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు వాసులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాదని వైవీ సుబ్బారెడ్డి .అన్నమయ్య ఇదే మార్గం ద్వారా తిరుమలకు చేరుకొన్నారని చారిత్రక ఆధారాలున్నాయని ఆయన గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios