Asianet News TeluguAsianet News Telugu

వెంకన్న దర్శనంపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం: తేల్చేసిన టీటీడీ

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు  తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేసినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

TTD clarifies on lord balaji darshan
Author
Tirumala, First Published Apr 28, 2020, 2:59 PM IST

తిరుపతి: లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు  తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేసినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి తిరుమలలో వెంకన్న దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొంది.
లాక్‌డౌన్ ను మే 3 వ తేదీ వరకు  పొడిగిస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకొంది. మే 3 వ తేదీ వరకు  కూడ భక్తులకు దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకొంది.

Also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: నెల రోజుల్లో రూ. 130 కోట్లు కోల్పోయిన టీటీడీ

ఈ ఏడాది మే 31 వ తేదీ వరకు సేవా, దర్శనం టిక్కెట్ల డబ్బులను భక్తులకు రీ ఫండ్ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. మే 30వ తేదీ వరకు  దర్శన, సేవా టిక్కట్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో మే చివరి వరకు కూడ భక్తులకు శ్రీవారికి దర్శనం నిలిపివేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఇదే తరుణంలో  జూన్ 30 వరకు కూడ తిరుమలలో భక్తులకు వెంకన్న దర్శనం ఉండదని టీటీడీ నిర్ణయం తీసుకొందని 
సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

భక్తులకు వెంకన్న దర్శనం విషయంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోనుంది. భక్తులకు దర్శనం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకొంటామని టీటీడీ తేల్చి చెప్పింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios