తిరుమలలో సినీ నటి అర్చన గౌతం ఆరోపణలు: టీటీడీ వివరణ ఇదీ

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్చన గౌతం ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. అర్చన గౌతం ఆరోపణలను టీటీడీ ఖండించింది. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం అర్చన గౌతం  రచ్చ చేసిందని చెప్పారు.

TTD Clarifies On Cine Actress Archana Gautam Allegations

తిరుపతి: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటి అర్చన గౌతం ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలను  టీటీడీ ఖండించింది. కేంద్ర సహాయ మంత్రి లేఖతో తిరుమలకు వచ్చారన్నారు. ఆమెకు రూ. 300 టికెట్ మంజూరు చేసినట్టుగా చెప్పారు. అయితే  సినీ నటితో వచ్చిన వారు ఈ టికెట్ ను వినియోగించుకోలేదన్నారు. దీంతో ఆమె అడిషనల్ ఈవో కార్యాలయానికి వచ్చి రచ్చ  చేశారని టీటీడీ  ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనం కావాలని సినీ నటి గొడవ చేశారన్నారు.  అయితే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం రూ. 10, 500 చెల్లించాలని చెప్పినట్టుగా  టీటీడీ ప్రకటించింది. తమ సిబ్బంది  లంచం అడిగామని మాపై నటిదుష్ప్రచారం చేశారన్నారు. తమ సిబ్బందిపైనే నటి అర్చన గౌతం దాడి చేశారని టీటీడీ తెలిపింది. సెలబ్రిటీ కాబట్టి ఏం చెప్పినా భక్తులు నమ్ముతారని  నటి అర్చన గౌతం అబద్దాలు చెబుతుందని టీటీపీ తెలిపింది. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని భక్తులను కోరింది టీటీడీ.

also read:నాపై దాడి చేశారు: టీటీడీ సిబ్బందిపై సినీ నటి అర్చన గౌతం సెల్ఫీ వీడియో

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చిన అర్చన గౌతం టీటీడీపై ఆరోపణలు చేసింది. తనను అవమానించడమే కాకుండా దాడి చేశారని కూడా ఆమె ఆరోపించింది.ఈ విషయమై ఆమె సెల్ఫీ వీడియో ను కూడా ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఏపీ ప్రభుత్వం టీటీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఏడుస్తూ ఆమె సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios