నాపై దాడి చేశారు: టీటీడీ సిబ్బందిపై సినీ నటి అర్చన గౌతం సెల్ఫీ వీడియో
టీటీడీ సిబ్బంది తనను అవమానించారని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటి అర్చన గౌతం ఆరోపించారు. రూ. 10, 500 చెల్లించినా కూడా తనకు టికెట్ ఇవ్వకుండా తనపై దాడి చేశారని ఆమె చెప్పారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన తనను టీటీడీ సిబ్బంది దారుణంగా అవమానించారని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటి అర్చన గౌతం ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆమె సెల్ఫీ వీడియోను సోమవారం నాడు పోస్టు చేశారు. తనను అవమానించిన టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
రూ. 10,500 పెట్టి టికెట్ కొన్నా కూడ తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.
టికెట్ కోసం కౌంటర్ కు వెళ్తే తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. టీటీడీ సిబ్బంది తీరును ఆమె తప్పు బట్టారు. ఈ ఘటనపై టీటీడీ బోర్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసకోవాలని ఆమె కోరారు. టీటీడీ టికెట్ కౌంటర్ వద్ద జరిగిన పరిణామాలను ఆమె సెల్పీ వీడియోలో పేర్కొన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. సెల్ఫీ వీడియోలో సినీ నటి అర్చన గౌతం కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు తిరుమలలో చోటు చేసుకున్న అనుభవాన్ని వివరించారు. ఆమె సెల్పీ వీడియో తీసుకుంటున్న సమయంలో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.