ఉత్తరాఖండ్: రిషికేశ్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యటించారు. రిషికేశ్ లో విశాఖపట్నం శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిలు చేపట్టిన చాతర్మాస్య దీక్షలో పాల్గొన్నారు. స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు. 

అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి పవిత్ర గంగానదిలో పుణ్య స్నానమాచరించారు వైవీ సుబ్బారెడ్డి దంపతులు. అనంతరం టీటీడీ చైర్మన్ గా నియమితులు అవ్వడం చేపట్టిన సంస్కరణలపై వైవీ సుబ్బారెడ్డి స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంలో మెరుగైన సేవల కోసం సూచనలు, సలహాలు అందించాలని స్వరూపానందేంద్రసరస్వతిని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠం చేపట్టిన సేవలు అభినందనీయమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.