Asianet News TeluguAsianet News Telugu

ఎవరొచ్చిన మాకు ఇబ్బంది లేదు.. జగన్ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి: వైవీ సుబ్బారెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తమ పార్టీపై ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పథకాలే తమ ఎజెండా అని తెలిపారు. 

TTD Chairman YV Subba Reddy Response On BRS Party
Author
First Published Oct 6, 2022, 3:35 PM IST

బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తమ పార్టీపై ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పథకాలే తమ ఎజెండా అని తెలిపారు. ఎవరొచ్చిన తమకు ఇబ్బంది లేదన్నారు. 40 ఈయర్స్ ఇండస్ట్రీ అన్న వ్యక్తే ఏం చేస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును విమర్శించారు. కొత్తగా ఎవరొచ్చినా చేసేది ఏమి ఉండదని అన్నారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని  అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బొమ్మ పెట్టుకుని వెళ్లి ఓట్లు అడుగుతామని చెప్పారు. పథకాలు అమలు కావాంటే జగన్‌కు ఓటేమని అడుగుతామని తెలిపారు. 

ఇక, ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కొత్త పార్టీల విషయంలో తాము వర్రీ కావాల్సిన అవసరం లేదన్నారు. తమ విధానం తమకుందని.. తాము ప్రజల కోసం  రాజకీయం చేస్తున్నామని అన్నారు. కొత్త పార్టీల రాకమై తాము విశ్లేషించమని చెప్పారు. తమ రాష్ట్ర అభ్యున్నతే తమకు ముఖ్యమని తెలిపారు. పక్క రాష్ట్రాల గురించి తాము మాట్లాడటం లేదని.. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి తమ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. 

Also Read: ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిది.. బీఆర్ఎస్‌పై మంత్రి బొత్స స్పందన..

భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో తమకు తెలియదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ఏపీ వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జలకు ఏం చేశామనే దానిపైనే పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఏపీ ప్రజల వైసీపీని ఓన్ చేసుకున్నారు కాబట్టి తమకే మద్దతిస్తారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios