దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు: విపక్షాలపై టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
దేవుడిని కూడా విపక్షాలు రాజకీయాల్లోకి లాగుతున్నాయని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట విషయమై ఆయన స్పందించారు.
తిరుపతి: దేవుడిని కూడా ప్రతిపక్షాలు రాజకీయాల్లోకి లాగుతున్నారని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇటీవల తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట జరిగిన ఘటనపై శుక్రవారం నాడు ఆయన స్పందించారు. ఈ తోపులాటలో దేవుడి దయ వల్ల ఎవరికీ కూడా ప్రాణాపాయం జరగలేదన్నారు. తోపులాట జరిగిన గంట లోపుగానే భక్తులను కొండపైకి అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భక్తుల్లో భయాందోళనలు కలిగేలా కుట్రలు చేస్తున్నారన్నారు.
ఈ నెల 12న తిరుపతిలోని సర్వ దర్శనం కౌంటర్ల వద్ద భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. భక్తుల రద్దీనిరద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 13 నుండి ఈ నెల 17వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 9వ తేదీనే ఈ నెల 12వ తేదీ వరకు సర్వ దర్శనం టోకెన్లను జారీ చేశారు. ఈ నెల 10,11 తేదీల్లో సర్వదర్శనం టికెట్ల జారీ చేయలేదు. దీంతో ఈ నెల 12న సర్వదర్శనం టికెట్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తిరుపతిలోని మూడు కౌంటర్ల వద్ద గంటల తరబడి భక్తులు టికెట్ల కోసం ఎదురు చూశారు. భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ క్రమంలో devotees మధ్య తోపులాట చోటు చేసుకొంది.
అయితే సర్వదర్శనం కౌంటర్ల వద్ద భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకోవడంతో భక్తులందరినీ నేరుగా తిరుమలకు పంపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టికెట్లు లేకుండానే భక్తులకు Tirumalaలో స్వామిని దర్శించుకొనే అవకాశం కల్పిస్తామని కూడా టీటీడీ ప్రకటించింది. తిరుమలకు భక్తులు వెళ్లేందుకు వీలుగా బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆదివారం వరకు కూడా నిలిపివేయాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎలాంటి టోకెన్ లేకుండానే నేరుగా తిరుమలకు వచ్చేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్ లోకి రెండేళ్ల తర్వాత భక్తుల్ని అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.కోవిడ్ కు పూర్వం ఉన్న విధానాన్నే టీటీడీ అవలంభించాలని నిర్ణయం తీసుకుంది.