Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస సేతు నిర్మాణానికి రూ. 118 కోట్లు: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

టీటీడీ పాలకవర్గం ఇవాళ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది.  ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

TTD Allots  Rs.3 Crore  For  construct Sub way  at Srinivasam in Tirumala  lns
Author
First Published Aug 7, 2023, 7:06 PM IST

తిరుపతి:  టీటీడీ  ఆస్తుల పరిరక్షణలో  భాగంగా 69 స్థలాలకు  కంచె ఏర్పాటుకు  రూ. 1.25 కోట్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.సోమవారంనాడు టీటీడీ  పాలకమండలి సమావేశం  ఇవాళ  ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి  మీడియాకు వివరించారు. తిరుమల ఘాట్ రోడ్లలో  రూ.24 కోట్లతో  క్రాష్ బ్యారియర్లను  ఏర్పాటు  చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  రూ. 23.50  కోట్ల వ్యయంతో  తిరుచానురు పద్మావతి  అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. మంగాపురం  ఆలయం వద్ద అభివృద్ధి పనులకు  రూ. 3.10 కోట్ల ఖర్చు చేయనున్నారు.  రూ. 4 కోట్లతో  అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి  ఆలయం నుండి మోకాలిమిట్ట వరకు  భక్తుల సౌకర్యార్థం  షెడ్లు ఏర్పాటు  చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  టీటీడీ చైర్మెన్ చెప్పారు.

శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయించాలని టీటీడీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.  రూ.2.60  కోట్లతో  తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో చార్జింగ్ స్టేషన్లను  ఏర్పాటు  చేయనున్నారు. శ్రీనివాస సేతు నిర్మాణం కోసం రూ. 118 కోట్లను టీటీడీ కేటాయించింది. ఎస్‌వీ  ఆయుర్వేద కాలేజీ అభివృద్ధి పనులకు  రూ. 11.5 కోట్లను కేటాయించింది టీటీడీ. రుయాలో  టీబీ వార్డు ఏర్పాటుకు  రూ. 2.20  కోట్లు కేటాయించాలని  టీటీడీ నిర్ణయం తీసుకుంది.
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ను టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడేళ్ల పొడిగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు.  తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయాభివృద్ధికి  రూ. 1.25 కోట్లను టీటీడీ కేటాయించింది.రూ.4.5  కోట్లతో నాణ్యత పరిశీలనకు  ల్యాబ్ ఆధునికీకరించనున్నట్టుగా  టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మెన్ గా  ఇదే చివరి  సమావేశం. వైవీ సుబ్బారెడ్డి చైర్మెన్ గా  పదవికాలం పూర్తైంది. దీంతో టీటీడీ కొత్త చైర్మెన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios