Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో  టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. 

Triple IT Entrance Exam Results Released in AndhraPradesh - bsb
Author
Hyderabad, First Published Dec 12, 2020, 12:20 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో  టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్‌ సిలబస్‌ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. 

జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్‌ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్‌‌స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే.

విద్యార్థులు తమ మార్కుల వివరాలను RGUKT WEAB site నుండి  తెలుసుకోవచ్చన్నారు. జనవరి 4 నుండి ఇంటర్ మీడియట్ అడ్మిషన్లు ఆన్ లైన్ ల్లోనే జరుగుతాయని తెలిపారు. ఈ ఫలితాలు తమ చీకటి వ్యాపారానికి అడ్డంకిగా మారతాయని, కొన్ని కార్పొరేట్ కాలేజ్ లు అడ్డుకోవాలని హై కోర్టు కు స్టే కోసం వెళ్లారన్నారు. 

దీనిమీద హై కోర్టు స్టే ఇచ్చింది. కోర్టులో తీర్పు ప్రభుత్వంకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం.  ఆన్ లైన్ ‌క్లాసులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. అంతేకాదు ఆన్ లైన్ క్లాసులకు ఫీజ్ డిమాండ్ చేస్తే బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios