గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారంనాడు అర గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది.

ప్రకంపనలతో ప్రజలు భీతిల్లారు. భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు చోటు చేసుకున్న సమయంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. 

మాచర్ల, గురజాల ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. గత మూడు రోజుల్లో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండోసారి.