వెంకోజీ పాలెం  జాతీయ రహదారిపై ట్రాలర్ బోల్తా పడ్డ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం వేకువజామున రెండున్నర గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.

వివరాల్లోకి వెడితే.. ఒడిశా నుండి జాతీయ రహదారి మీదుగా  విశాఖ వైపుగా వస్తున్న ట్రాలర్ కంటైనర్ లారీ శనివారం వెకువజామున 2:30 గంటల ప్రాంతంలో వెంకోజీ పాలెం కూడలి వద్ద ఒక్క సారిగా అదుపు తప్పి బోల్తా పడింది.

అర్థరాత్రి కావడం, వాహనాల సంచారం లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టంకానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే త్రీ టౌన్ సి.ఐ , ఎస్ .ఐ లు ఘటన స్థలానికి చేరుకొని  సహాయక చర్యలు చేపట్టారు. గంటల వ్యవథిలోనే ట్రాలర్ ను రహదారి పై నుంచి తొలగించారు.

దీంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదని ఫోర్త్ టౌన్ ఆర్ .ఎస్, మొబైల్ ట్రాఫిక్ ఎ.ఎస్.ఐ అప్పరావు తెలిపారు.