వీళ్ళూ ఎన్నికల్లో పోటీ చేయచ్చు

Transgender can also contest in the elections
Highlights

  • ట్రాన్స్‌జెండర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం శుభవార్త ప్రకటించింది.

ట్రాన్స్‌జెండర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం శుభవార్త ప్రకటించింది. వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించింది. అలాగే ట్రాన్స్‌జెండర్ పాలసీని ప్రకటిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43,769 మంది ట్రాన్స్ జెండర్ ఉన్నారు.  వీళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం మొన్నటి మంత్రివర్గంలో నిర్ణయిచిన సంగతి అందరకీ తెలిసిందే. అందులో భాగంగానే 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్ పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదని, విద్యా, ఉద్యోగాల్లో వివక్ష చూపరాదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించటం గమనార్హం.  

loader