శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కర్మకాండలు చేపట్టేందుకు వచ్చి.. నదిలో మునిగి టెక్కీ మృతి
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కార్మకాండలు నిర్వహించే క్రమంలో ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీటిలో మునిగి మరణించారు.
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామానికి వచ్చిన ఓ టెక్కీ నదిలో మునిగిపోయి చనిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని హిర మండలం శుభలయ్య ఆర్ఆర్ కాలనీకి చెందిన సుర్యారావు కొన్ని రోజుల కిందట హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఆయనకు 30 ఏళ్ల లలిత్ సాగర్ అనే కుమారుడు ఉన్నారు. అతడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారు.
కానిస్టేబుళ్లను స్టేషన్లో నగ్నంగా కూర్చోబెట్టిన..ఎస్పీ.. ఎందుకంటే..
తండ్రి చనిపోయాడని తెలుసుకున్న లలిత్ సాగర్ స్వగ్రామానికి వచ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన తరువాత శుక్రవారం కర్మకాండలు నిర్వహించడానికి గొట్టా బ్యారేజి వద్దకు వచ్చారు. కార్యక్రమం అనంతరం ఆ నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే స్నానం చేస్తున్న క్రమంలో ఆయన నీటిలో మునిగిపోయారు.
పాదయాత్రపై అమరావతి రైతుల పిటిషన్.. విచారణ ముగిసే వరకు హైకోర్టులోనే మంత్రి అమర్‌నాథ్
దీనిని అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించారు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి లాభం లేకపోయింది. ఈ ఘటన పోలీసులకు తెలియడంతో వెంటనే వారు గొట్టా బ్యారేజి వద్దకు చేరుకున్నారు. గత ఈతగాళ్లను అక్కడికి రప్పించారు. వారితో గాలింపు చర్యలు చేపట్టడంతో డెడ్ బాడీ లభ్యం అయ్యింది.
హిందూపురం : రామకృష్ణారెడ్డి హత్య కేసులో 16 మంది అరెస్ట్... నిందితుల్లో ఎమ్మెల్సీ పీఏ
వెంటనే డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పాతపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. లలిత్ సాగర్ కు భార్య, రెండు నెలల కూతురు ఉన్నారు. కేవలం వారం రోజుల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.