గుంటూరు జిల్లాలో (guntur district) విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో (krishna river) ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. స్థానిక వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అచ్చంపేట (achampet) మండలంలోని మాదిపాడు సమీపంలో వున్న కృష్ణానదిలో ఈతకు వెళ్లారు.

గుంటూరు జిల్లాలో (guntur district) విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో (krishna river) ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అచ్చంపేట (achampet) మండలంలోని మాదిపాడు సమీపంలో వున్న కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఆరుగురు విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులను హర్షిత్‌ శుక్లా, శుభమ్‌ త్రివేది, అన్షుమన్‌ శుక్లా, శివ శర్మ, నితేష్‌ కుమార్‌ దిక్షిత్‌గా గుర్తించగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ఆరుగురు విద్యార్ధులు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది.