గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కురగల్లు గ్రామం వద్ద బ్రిడ్జి బుధవారం ఉదయం కూలిపోయింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం క్షేత్రస్ధాయిలో పనులు మొదలయ్యాయి. దాని కోసం ఆయా పనులకు సామాగ్రిని పెద్దఎత్తున తరలిస్తున్నారు.  విజయవాడ తదితర ప్రాంతాల నుండి భారీ వాహనాల ద్వారా ఈ బ్రిడ్జిపై నుంచి సామగ్రిని తరలిస్తుండడంతో ఒత్తిడి పెరిగి కుంగిపోయింది. దీంతో కురగల్లు-నిడమర్రు మధ్య రాకపోకలు ఉదయం నుండి నిలిచిపోయాయి. కాగా బ్రిడ్జి కుంగిపోయిన సమాచారాన్ని తెలుసుకున్న సంబంధిత అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించారు. మరమ్మతులే చేస్తారో లేక కొత్తదేద నిర్మించాలంటారో? ఎంత కాలానికి రాకపోకలు మొదలవుతాయో చూడాలి?