నంద్యాల జిల్లా శీశ్రైలం నల్లమల్ల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.

నంద్యాల జిల్లా శీశ్రైలం నల్లమల్ల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని శ్రీశైలం, సున్నిపెంట ఆస్పత్రులకు తరలించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బస్సులోని వారంతో భదాద్రి కొత్తగూడెం జిల్లా‌కు చెందినవారని గుర్తించారు. వీరంతా శ్రీశైలం మల్లన్న దర్శానికి ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అయితే ఘాట్ రోడ్డులో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.