అగ్రనేత రామకృష్ణ(ఆర్‌కె) మృతి: ధృవీకరించిన మావోయిస్టు పార్టీ

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మరణించాడని ఆ పార్టీ ప్రకటించింది.ఈ నెల 14న ఆర్కే అనారోగ్యంతో చనిపోయాడని పార్టీ వివరించింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో  మీడియాకు శుక్రవారంనాడు ప్రకటన విడుదలైంది.

Top leader Rama Krishna dead, confrims Maoist party

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ Rama Krishna మరణించినట్టుగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన ఆర్‌కె మరణించినట్టుగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు.

also read:ఆర్‌కె మృతిపై సమాచారం రాలేదు, ప్రభుత్వ హత్యే: భార్య శిరీష

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె కు కిడ్నీల్ ఫెయిల్ కావడంతో మరణించినట్టుగా అభయ్ తెలిపారు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి శుక్రవారం నాడు మీడియాకు ప్రకటనను విడుదల చేశారు.Maoistపార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్‌కే అంత్యక్రియలను నిర్వహించినట్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి Abhay ప్రకటించారు.

కిడ్నీలు పాడు కావడంతో ఆర్‌కెకు చికిత్స కూడా అందించామని ఆ ప్రకటనలో అభయ్ వివరించారు. అయితే  ఆర్‌కెను కాపాడుకోలేకపోయామన్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం ఆరు గంటల సమయంలో ఆర్‌కె మరణించినట్టుగా ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

1958 గుంటూరు జిల్లా పల్నాడులో ఆయన జన్మించాడు. గుంటూరు జిల్లా మాచర్లలో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికట్ స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నాడు.1980లో తొలిసారిగా ఆయన పీపుల్స్ వార్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

1982లో పీపుల్స్‌వార్ లో హోల్ టైమర్ గా చేరాడు. దీంతో ఆర్‌కె  అడవుల్లోకి వెళ్లిపోయారు. నల్లమల అటవీ ప్రాంతంలో పార్టీ విస్తరణకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1996 నుండి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.

 2008 నుండి 2016 వరకు ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు.  ఆ తర్వాత ఆయన  కేంద్రకమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. మావోయిస్టు కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించారు. దీంతో ఉన్న కొద్ది మంది నేతల రక్షణ కోసం పార్టీ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని అడవుల్లోకి రావాలని ఆదేశించింది.
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios