Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ లో భారీగా పతనమైన టమాట ధర: కిలో 30 పైసలు

టమాట ధర భారీగా పతనమైంది.  దీంతో రైతులు  టమాటను  రోడ్లపై పారబోస్తున్నారు.

Tomoto prices  fall below 30 paise kg in Kurnool district lns
Author
First Published Sep 7, 2023, 3:58 PM IST

కర్నూల్:టమాట ధర భారీగా పతనమైంది. మూడు మాసాల క్రితం మూడు వందల రూపాయాలకు పైగా కిలో పలికిన టమాట ఇవాళ  30 పైసలకు పడిపోయింది.  చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మార్కెట్ లో కూడ  కిలో టమాట రూ.3 లకు పడిపోయింది. 

కర్నూల్ జిల్లాలోని పత్తికొండ, ప్యాపిలితో పాటు ఇతర మార్కెట్లలో  టమాటకు భారీగా ధర పడిపోయింది. రెండు వారాల క్రితం  కిలో రూ. 15లు పలికింది. కానీ  ఇవాళ మాత్రం  30 పైసలకు పడిపోయింది.  మార్కెట్లో   కిలో టమాటను విక్రయించలేక పశువులకు  దాణాగా  టమాటను పెడుతున్నారని  రైతులు.   
కర్నూల్ జిల్లాలో  పండించిన  టమాట  ఆగస్టు మాసంలో  మార్కెట్లోకి వస్తుంది. దీంతో  టమాట  ధర తగ్గిపోయిందని  చెబుతున్నారు.

మూడు మాసాల క్రితం  టమాట ధర  ప్రజలకు చుక్కలు చూపింది.  టమాట లేకుండానే కూరలు వండుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  టమాటకు బదులుగా  నాన్ వెజ్ ను కొనుగోలు చేసిన  పరిస్థితి కూడ లేకపోలేదు.  టమాట  ధర కిలో రూ. 300 పలికిన సమయంలో  కొందరు  రైతులు కోటీశ్వరులయ్యారు.    అదే టమాట పండించిన రైతులు ప్రస్తుతం కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి  దాపురించింది.  30 పైసలకు  కిలో టమాటను విక్రయించలేక  రోడ్లపై పారేస్తున్నారు. మరికొందరు  రైతులు  పశువులకు  ఆహారంగా అందిస్తున్నారు. టమాట  ధర భారీగా పతనం కావడంతో  కనీసం పెట్టుబడి కూడ దక్కని పరిస్థితి నెలకొందని  రైతులు చెబుతన్నారు.

టమాట ధర భారీగా పడిపోవడంతో  ఆ పంటను పండించిన  రైతులు  ఆందోళనలో ఉన్నారు. మార్కెట్ కు  తీసుకువచ్చిన టమాటకు  ధర రాకపోవడంతో కొందరు రైతులు  రోడ్లపై  పారబోస్తున్నారు. మరికొందరు రైతులు  టమాటలను పశువులకు  ఆహారంగా అందిస్తున్నారు.రైతులకు  మార్కెట్లో  టమాటకు  కనీస ధర లభ్యం కావడం లేదు. వినియోగదారులకు  చౌకగా  టమాట దొరకడం లేదు. మధ్య దళారులు మాత్రం టమాట కొనుగోలులో  ప్రయోజనం పొందుతున్నారు.  రైతుల నుండి  30 పైసలకు  కొనుగోలు చేస్తున్న మధ్య దళారులు, వ్యాపారులు  వినియోగదారులకు  కిలో రూ. 20 లకు  విక్రయిస్త్నారు.  కొన్ని చోట్ల కిలో రూ. 25 నుండి  రూ. 30లకు విక్రయిస్తున్నారు.  కానీ  టమాట పండించిన రైతుకు మాత్రం  కిలోకు  రూపాయి కూడ దక్కడం లేదు. ఈ  విషయంలో  ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios