తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షింస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్  కళ్యాణ మండంపంలో సహస్రచండీయాగం చేయనుంది.  

సహస్రచండీయాగానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విద్యుత్  శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఎలాంటి ఉపద్రవాలు సంభవించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాలని కోరుతూ సహస్ర చండీయాగం చేయనున్నట్లు తెలుస్తోంది.