Asianet News TeluguAsianet News Telugu

నో క్యాష్, నో కండక్టర్... కరోనా నేపథ్యంలో ఏపిఎస్ ఆర్టీసి వినూత్న ప్రయత్నం

లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రేపటి నుండి ఏపీలో రోడ్డెక్కనున్నాయి. 

Tomorrow RTC Bus Services Starts in AP
Author
Amaravathi, First Published May 20, 2020, 12:48 PM IST

అమరావతి: రేపటి(గురువారం) నుంచి ఏపీలో ఆర్టీసి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏసీ, సిటీ బస్సులు ఇంకొన్నిరోజులు డిపోలకే పరిమితమవనుండగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులు మాత్రం ప్రయాణానికి సిద్దమయ్యాయి. సుమారు 55 రోజుల నుంచి డిపోలకే పరిమితం కావటంతో దుమ్మెక్కిన బస్సులను శుభ్రం చేయిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. అలాగే ప్రతీ బస్ స్టాండ్ లో శాని టైజర్ సిబ్బంది, ప్రయాణికులకు అందుబాటులో వుండే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ఏపిఎస్ ఆర్టీసి ఎండి ప్రతాప్ మాట్లాడుతూ... ''లాక్ డౌన్ విధించినప్పటి నుండి కొన్ని ప్రత్యేక సర్వీసులు మినహా ఏపీలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే  ఏనాటికన్నా బస్సులు రోడ్డెక్కే శుభ గడియ వస్తుందని చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నాం'' అని అన్నారు. 

'' చైనాలోని బీజింగ్, షాంఘై లాంటి ప్రాంతాల్లో బస్సులు నడుపుతున్న పద్దతి గమనించాం. కండక్టర్ ను పెడితే అతను ఒక సూపర్ స్ప్రెడర్ గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఆన్ బోర్డ్ కండక్టర్ లేకుండానే బస్సులు నడపాలని నిర్ణయించాం'' అని వెల్లడించారు. 

''ఇక బస్సులో పక్క పక్కనే సీట్లు ఉంటాయి. అది ప్రమాదకరం కాబట్టి బస్సుల్లో కొత్తగా సీటింగ్ ఎరేంజ్ మెంట్ చేశాం. అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే చేశాం. ఒక్కో బస్సు కోసం పదివేలు మాత్రమే ఖర్చు పెట్టాం. పల్లె వెలుగు లాంటి బస్సుల్లో ఏయే కుర్చీల్లో కూర్చోకూడదో..అలాంటి చోట్ల రెడ్ మార్క్ వేశాం'' అని తెలిపారు. 

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు మాస్కులు ధరించడం తప్పనిసరి. ప్రయాణ ప్రాంగణాల్లోని స్టాళ్లన్నింటిలో మాస్కులు సిద్ధంగా ఉండాల్సిందే. అదికూడా 10 రూపాయలకు మించకుండా. అంత ప్రమాదం కానప్పటికీ క్యాష్ హాండలింగ్ కి కూడా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.  నగదు రహిత టికెట్ ఇష్యుకే మా ప్రాధాన్యత'' అని ఆర్టీసి ఎండి వెల్లడించారు. 

క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వేలెట్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించారు. ఆన్లైన్ రిజర్వేషన్లు ఈరోజు సాయంత్రం నుంచి అందుబాటులోకి తెనున్నారు. అయితే 65 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు...10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఆర్టీసి అధికారులు ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios