Asianet News TeluguAsianet News Telugu

Tomato : 45 రోజుల్లో రూ.4 కోట్లు సంపాదించిన టమాటా రైతు

Chittoor: గ‌త రెండు నెల‌లుగా దేశ‌వ్యాప్తంగా ట‌మాటో ధ‌ర‌లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించిన ట‌మాటా ధ‌ర‌లు.. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. అయితే, కొంత మంది రైతుల‌ను ట‌మాటాలు కోటీశ్వ‌రుల‌ను చేశాయి. ఏపీకి చెందిన ఒక ట‌మాటా రైతు కేవ‌లం 45 రోజుల్లోనే 4 కోట్ల రూపాయ‌లు సంపాదించారు.
 

Tomato : tomato farmer in Andhra Pradeshs Chittoor earns Rs 4 crore in 45 days RMA
Author
First Published Jul 30, 2023, 10:02 AM IST

Tomato farmer: గ‌త రెండు నెల‌లుగా దేశ‌వ్యాప్తంగా ట‌మాటో ధ‌ర‌లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గతవారం కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించిన ట‌మాట ధ‌ర‌లు.. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌తో ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. అయితే, కొంత మంది రైతుల‌ను ట‌మాటాలు కోటీశ్వ‌రుల‌ను చేశాయి. ఏపీకి చెందిన ఒక ట‌మాటా రైతు కేవ‌లం 45 రోజుల్లోనే 4 కోట్ల రూపాయ‌లు సంపాదించారు. ఇంత పెద్ద మొత్తంలో త‌న‌కు ఆదాయం వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నాడు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో టమాటా రైతు 45 రోజుల్లోనే అక్షరాలా రూ.4 కోట్లు రాబట్టి  జాక్‌పాట్ కొట్టాడు. టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ట‌మాటా రైతు మురళి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. ఆయ‌న వేసిన ట‌మాటా పంట సిరి సంప‌ద‌ను కురిపించింది. ఆయ‌న మదనపల్లెలోని టమాటా మార్కెట్‌లోనే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకకు కూడా ఎక్కువ ధర పలుకడంతో ట‌మాటాల‌ను విక్రయించాడు.

మురళి దంపతులు ఏప్రిల్‌లో కరకమండ్ల గ్రామంలోని 22 ఎకరాల భూమిలో టమోటా సాగు చేశారు. గత 45 రోజులలో, వారు 40,000 టమాట బాక్సులను విక్రయించారు. పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో గతంలో ఇదే కూరగాయ సాగు చేసిన రూ.1.5 కోట్ల అప్పులు తీర్చగలిగామని రైతు తెలిపారు. విద్యుత్ సరఫరా బాగుండడంతో ఈసారి దిగుబడి బాగా వచ్చిందని మురళి తెలిపారు. అయితే, టమాటా ధరలు బాగా పెరగడం అతిపెద్ద మలుపుగా మారింది. త‌మ అదృష్టం ప‌డింద‌నీ, కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌ని తెలిపారు.  "టమాటా ఇంత పెద్ద ఆదాయాన్ని ఇస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు" అన్నాడు ట‌మాటా రైతు  మురళి చెప్పారు. అతను లాభంలో కొంత భాగాన్ని ఉద్యానవన కార్యకలాపాలను విస్తరించడానికి పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

అలాగే, తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఒక రైతు గత నెల రోజులుగా టమోటాలు అమ్మడం ద్వారా రూ. 2 కోట్లు సంపాదించాడు, కోటి రూపాయల విలువైన మరో పంట కోతకు సిద్ధంగా ఉంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్‌కు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి టమాట ధర ఆకాశాన్నంటడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మార్కెట్‌లో టమాట ధర కిలో రూ.150కి పెరగడం, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సరిపడా సరఫరా లేకపోవడంతో మహిపాల్‌రెడ్డి హైదరాబాద్‌ మార్కెట్‌లో డిమాండ్‌ను తీర్చాడు. కోట్ల రూపాయ‌ల ఆదాయం పొందాడు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో రూ.100కు విక్రయించాడు. గత ఒక నెలలో, అతను సుమారు 8,000  టమాటా బాక్సుల‌ను విక్రయించాడు. ఒక్కొక్కటి 25 కిలోలకు పైగా ఉంటుంద‌ని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios