దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. పలుచోట్ల కిలో టమాటా ధర రెండు వందల రూపాయలు కూడా క్రాస్ చేసింది.
దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. పలుచోట్ల కిలో టమాటా ధర రెండు వందల రూపాయలు కూడా క్రాస్ చేసింది. అయితే ప్రస్తుతం చాలా చోట్ల టమాటా ధరలు కొంతమేర తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా దిగివచ్చాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు భారీగా పంట వస్తుండటంతో.. క్రమంగా టమాటా ధర దిగివస్తుంది.
మదనపల్లె టమోటా మార్కెట్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే పంట చివరి దశలో ఉన్నందున గత నెలలో ఇక్కడ కూడా టమాటా ధరలు భారీగానే పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏ గ్రేడ్ టమాటా కిలో ధర గరిష్టంగా రూ. 196 పలికింది. అయితే ఇప్పుడు భారీగా పంట వస్తుండటంతో.. బుధవారం రోజున మార్కెట్ టమాటా కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది.
అయితే ఈ రోజు గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది. సగటున కిలోకు రూ. 44 నుంచి రూ.60 మధ్య రైతుల నుంచి వ్యాపారులు టమాటాలు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ తెలిపారు.
