చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన సుమారు 60 మంది బండ్ల గణేష్ కి పెద్దమొత్తంలో అప్పు ఇచ్చారు. ఆ డబ్బులకు సంబంధించి బండ్ల గణేష్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. 

దీంతో బండ్ల గణేష్ కి అప్పు ఇచ్చిన వారంతా  ప్రొద్దుటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులకు సంబంధించి గతంలోను బండ్ల గణేష్‌ ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. మంగళవారం తిరిగి ఆ చెక్‌బౌన్స్‌ కేసులకు సంబంధించి వాయిదా ఉండటంతో ఆయన హైదరాబాదు నుంచి వచ్చి, ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. ఈ కేసులను ఆగస్టు 7వ తేదీకి మేజిస్ర్టేట్‌ వాయిదా వేశారు.